తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాతో చర్చలకు ముందు అత్యున్నత స్థాయి సమావేశం

భారత్​-చైనా మధ్య ఈ నెల 12న 7వ కార్ప్స్​ కమాండర్ స్థాయి​ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. దేశంలోని అత్యున్నత స్థాయి మిలిటరీ, రాజకీయ వర్గాలు భేటీ అయ్యాయి. తూర్పు లద్దాఖ్​లోని భద్రతా పరిస్థితులతో పాటు కమాండర్ల భేటీలో పాటించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Top political and military brass discusses Ladakh situation ahead of 7th round of Corps Commander talks
చైనాతో చర్చల ముందు అత్యునత స్థాయి సమావేశం

By

Published : Oct 10, 2020, 5:29 PM IST

తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ నెల 12న కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో పాటించాల్సిన వ్యూహాలను సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి మిలిటరీ, రాజకీయ వర్గాలు సమావేశమయ్యాయి.

ఈ సీఎస్​జీ(చైనా స్టడీ గ్రూప్​) సమావేశంలో తూర్పు లద్దాఖ్​లో భద్రతా పరిస్థితులను కూడా సమీక్షించారు. దీనితో పాటు పలు కీలక విషయాలపై చర్చలు జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సీఎస్​జీలో.. విదేశాంగమంత్రి జైశంకర్​, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, త్రిదళాధిపతి బిపిన్​ రావత్​తో పాటు వివిధ దళాధిపతులు సభ్యులుగా ఉన్నారు.

భారత్​-చైనా మధ్య చివరిసారిగా సెప్టెంబర్​ 21న మిలిటరీ స్థాయిలో చర్చలు జరిగాయి. సున్నిత ప్రాంతాలకు బలగాలను తరలించవద్దని, ఏకపక్షంగా సరిహద్దును మార్చే ప్రయత్నం చేయకూడదని ఈ భేటీలో ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే ఈసారి జరగనున్న చర్చల్లో.. క్షేత్రస్థాయిలో మరింత స్థిరత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్చలు జరపనున్నారు.

ఇదీ చూడండి:-'భారత సరిహద్దులో 60 వేల మంది చైనా సైనికులు'

ABOUT THE AUTHOR

...view details