తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ యుద్ధ స్మారకంపై స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా పేరు - భారత వాయుసేన

అమరవీరుడు స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా పేరును జాతీయ యుద్ధ స్మారకంపై లిఖించేందుకు భారత వాయుసేన ఆమోదం తెలిపింది. రవిఖన్నాను 1990లో జమ్ముకశ్మీర్ లిబరేషన్​ ఫ్రంట్​కు చెందిన కరుడుగట్టిన వేర్పాటువాది యాసిన్​ మాలిక్ హత్య చేశాడు.

జాతీయ యుద్ధ స్మారకంపై స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా పేరు

By

Published : Oct 5, 2019, 7:51 PM IST

దేశం కోసం ప్రాణాలు ధారపోసిన అమరవీరుడు స్క్వాడ్రన్​ లీడర్​ రవిఖన్నా పేరును జాతీయ యుద్ధ స్మారకంపై లిఖించేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్​) ఆమోదం తెలిపింది. రవిఖన్నాను 1990లో వేర్పాటువాది యాసిన్​మాలిక్ హత్యచేశాడు.

రవిఖన్నా పేరును యుద్ధ స్మారకంపై లిఖించాలని వాయుసేన ఉన్నతాధికారులు సెప్టెంబర్ చివరివారంలోనే నిర్ణయం తీసుకున్నారు. జాతీయ యుద్ధ స్మారకంలో దేశంకోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల వివరాలు, వారి సాహసాలను లిఖిస్తారు.

'నిర్మల పోరాటం'

అమరుడైన తన భర్త రవిఖన్నాకు న్యాయం జరగాలని నిర్మలాఖన్నా పోరాటం చేశారు. ఆయన పేరును జాతీయ యుద్ధ స్మారకంపై లిఖించాలని నిర్మలా ఖన్నా విజ్ఞప్తి చేశారు. ఆమె పోరాటం ఫలించింది. రవిఖన్నా పేరును యుద్ధ స్మారకంపై లిఖించేందుకు ఐఏఎఫ్ ఆమోదం తెలిపింది.

'జమ్ము కశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​'కు చెందిన కరుడుగట్టిన వేర్పాటువాది యాసిన్​ మాలిక్​. ఈ ఉగ్రవాది 1990 జనవరి 25న రవిఖన్నాతో పాటు మరో ముగ్గురు వైమానిక దళ అధికారులను హత్యచేశాడు. యాసిన్​మాలిక్​పై సీబీఐ కేసు నమోదుచేసింది. చివరికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) యాసిన్​ను అరెస్టు చేసి తిహార్​ జైలులో వేసింది.

ఇదీ చూడండి:బస్సు ముందు చిందులేస్తూ యువతి టిక్​టాక్​ వీడియో

ABOUT THE AUTHOR

...view details