జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. దోడా జిల్లాలో ముష్కరులకు, భద్రతా దళాలకు మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన కీలక సభ్యుడు హతమయ్యాడు.
జిల్లాలోని గోన్దాన బెల్ట్ పరిధిలో ఉగ్రమూకలు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు ముష్కరులు.
మోస్ట్ వాంటెడ్
ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన ఏ++ కేటగిరి సభ్యుడు హరున్ హఫాజ్ హతమయ్యాడు. పలువురు రాజకీయ నేతల హత్య, కిస్త్వార్లో ఆయుధాల దొంగతనం సహా పలు ఉగ్ర చర్యల్లో అతడు కీలక పాత్రధారిగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాంబన్‌లో పోలీసుల కాల్పుల్లో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కిస్త్వార్ కమాండర్ ఒసామా జావేద్‌కు అత్యంత సన్నిహితుడిని తెలిపారు.