బిహార్ ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ కూడా తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి.. 30మంది స్టార్ క్యాంపైనర్స్తో కూడిన జాబితాను రూపొందించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్-ప్రియంక గాంధీలు త్వరలో ప్రచారాల్లోకి దిగనున్నరు. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి కూడా పంపించినట్టు తెలుస్తోంది.
ప్రచారకర్తల జాబితాలో.. సీనియర్ నేతలు గులామ్ నబీ ఆజాద్, శక్తిసిన్హ్ గోహిల్, షకీల్ అహ్మద్, రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భుపేష్ బఘేల్, కెప్టెన్ అమరీందర్ సింగ్‌లను కూడా రంగంలోకి దించింది కాంగ్రెస్.
ఇదీ చూడండి:-బిహార్ బరి: వామపక్షాలు సత్తా చాటేనా?