పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద 'సత్యాగ్రహం' చేపట్టింది కాంగ్రెస్. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక గాంధీలు, గులామ్ నబీ ఆజాద్ సహా పార్టీ సీనియర్ నేతలు నిరసనలో పాల్గొన్నారు
సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ 'సత్యాగ్రహం' - CONGRESS CAA PROTESTS
దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ 'సత్యాగ్రహం' చేపట్టింది. పౌరసత్వ చట్టంతో పాటు భాజపా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేసింది. ఇందుకోసం మహాత్ముడు చూపించిన అహింసా పద్ధతిని ఎంచుకున్నట్టు స్పష్టం చేసింది.
కాంగ్రెస్ 'సత్యాగ్రహం'- భాజపాపై పోరాటం
మహాత్ముడు నడిచిన అహింసా మార్గంవైపే అడుగులు వేస్తూ భాజపా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హస్తం పార్టీ తెలిపింది. పవిత్ర రాజ్యాంగాన్ని రక్షించడానికే ఈ సత్యాగ్రహం అని స్పష్టం చేసింది.
నిరసనలు తెలపడం ప్రజల హక్కు అని... బలగాలను ఉపయోగించి ఆ హక్కును కాషాయ పార్టీ అణచివేస్తోందని ఆరోపించింది హస్తం పార్టీ. శాంతిభద్రతల పేరుతో విద్యార్థులపై దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.