జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆస్తులు, మానవ వనరుల విభజన విషయంపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి ఏకే భల్లా అధ్యక్షత వహించారు.
15 మంది కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించిన 85 అభివృద్ధి పథకాలను అమలు చెయ్యడంలో కేంద్రం సహకరిస్తుందని ఓ అధికారి తెలిపారు.శ్రీనగర్‌లో ఇప్పటికే కేంద్రంలోని కొన్ని బృందాలు పర్యటించాయని చెప్పారు.