ఆర్మీ కమాండర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సైన్యాధికారులు. స్వదేశీ, విదేశీ తయారీ రక్షణ ఉత్పత్తులు, డ్రోన్లను పరిశీలించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు.
పంజాబ్లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి పాకిస్థాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని సైన్యం నిర్ణయించింది. ఇందుకోసం దేశ, విదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పలు కౌంటర్ డ్రోన్లను బిపిన్ రావత్, కమాండర్స్ పరిశీలించారు.
ఇజ్రాయెల్ డ్రోన్లు
అత్యంత ఎత్తైన ప్రదేశాలకు చేరుకోగలిగే సామర్థ్యం గల, శత్రు లక్ష్యాలను శోధించి, గుర్తించి, నాశనం చేయగల ఇజ్రాయెల్ తయారీ డ్రోన్లనూ అధికారులు పరిశీలించారు.