తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగం చూసుకోమన్నందుకు తల్లినే కడతేర్చిన యువకుడు - ఉద్యోగం చేయమన్నందుకు హత్య

ఉద్యోగం చూసుకోమని చెప్పినందుకు కన్నతల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు. మధ్యప్రదేశ్​లోని ఖండ్వాలో జరిగింది ఈ ఘటన. ఓ క్రైమ్​ సీరియల్​ చూసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపెట్టాడు ఆ యువకుడు.

MAN KILLS MOTHER
ఉద్యోగం చూసుకోమన్నందుకు తల్లినే కడతేర్చిన యువకుడు

By

Published : Feb 23, 2020, 6:54 AM IST

Updated : Mar 2, 2020, 6:21 AM IST

మధ్యప్రదేశ్​లోని ఖండ్వాలో దారుణం చోటు చేసుకుంది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చూసుకోమన్నందుకు.. కన్న తల్లినే హత్య చేశాడు ఓ కిరాతకుడు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళ్తే..

తల్లి విమల బాయ్​ (50), కొడుకు సంతోశ్​ పాటిల్​ (32)కు మధ్య ఇటీవల ఉద్యోగం విషయంలో గొడవలయ్యాయి. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని కొడుకును వారించారు మిమలా బాయ్​. అది నచ్చని యువకుడు.. కన్నపేగు బంధాన్ని విస్మరించాడు. బట్టలు ఉతికే కర్ర (వాషింగ్ పాడిల్​)తో కొట్టి ఆమెను హత్య చేశాడు.

సోమవారం ఈ ఘాతుకానికి పాల్పడి.. గురువారం అర్ధ రాత్రి తల్లి శవాన్ని స్థానికంగా ఉన్న ఓ గుంతలో పడేశాడు.

గుంత నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఓ క్రైమ్ సీరియల్​ చూసి హత్యకు తెగబడ్డట్లు పోలీసుల దర్యప్తులో అంగీకరించాడు నిందితుడు.

ఇదీ చూడండి:చండీగఢ్​లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

Last Updated : Mar 2, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details