జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం వాదనలు విననుంది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది కే ఎల్ శర్మ సర్వోన్నత న్యాయస్థానంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
'కశ్మీర్' పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. కశ్మీర్‌లో ఆంక్షలను సడలించాలంటూ దాఖలైన మరో వ్యాజ్యంపైనా విచారణ చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం.
370కి వ్యతిరేకంగా దాఖలైన పటిషన్‌పై నేడు విచారణ
కశ్మీర్‌లో సమాచారం, మీడియాపై ఆంక్షలు సడలించాలంటూ కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బైసిన్ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది.
Last Updated : Sep 27, 2019, 3:43 AM IST