సుప్రీం కోర్టులో ఓ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేటుచేసుకుంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం కావాలా? బెయిల్ కావాలా? అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సరదాగా వ్యాఖ్యానించారు.
1994లో భాజపాకు చెందిన రాజకీయ నేత హత్య కేసులో కాంగ్రెస్‌కు చెందిన ధర్మేంద్ర వాల్వి, మరో ఐదుగురు ఆ పార్టీ కార్యకర్తలు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వాల్వి బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.
"ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడు పుట్టింది జైలులోనే. మరి మీకు జైలు కావాలా? బెయిలు కావాలా?" అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు సీజేఐ. అందుకు ఆయన బెయిల్ కావాలని చెప్పగా.. "మంచిది. మీకు పెద్దగా మతం పట్టింపులు లేవనుకుంటా" అంటూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.