తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆఖరి పనిదినానికి జస్టిస్​ గొగొయి ప్రత్యేక ముగింపు - సీజేఐగా గొగొయి చివరి పనిదినం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి తన చివరి పనిదినాన్ని ముగించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జస్టిస్‌ గొగోయ్‌కు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనుంది.

చివరి పనిదినాన్ని ప్రత్యేకంగా ముగించుకున్న సీజేఐ

By

Published : Nov 15, 2019, 12:29 PM IST

Updated : Nov 15, 2019, 1:01 PM IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి తన చివరి పని దినాన్ని ప్రత్యేకంగా ముగించారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్టయిన పిటిషన్లన్నింటికీ ఈరోజు ఒకేసారి నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా సీజేఐగా తన చివరి పని దినాన్ని ముగించుకున్నారు.

సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ రంజన్‌ గొగొయికు వీడ్కోలు పలకనున్నారు. ఈ నెల 17న జస్టిస్‌ రంజన్‌ గొగొయి పదవీ విరమణ చేయనున్నారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడం వల్ల ఆయన ఇవాళ సీజేఐగా తన చివరి పని దినాన్ని ముగించుకున్నారు. ఆయన స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే బాధ్యతలు స్వీకరిస్తారు.

సీజేఐగా కీలక తీర్పులు...

భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ రంజన్​ గొగొయి ఇచ్చిన కీలక తీర్పులు..

⦁ ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతోన్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో చారిత్రక తీర్పు.

⦁ శబరిమలకు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను.. ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయం.

⦁ రఫేల్ యుద్ధవిమాన కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్​ చిట్. రఫేల్​ తీర్పును సమీక్షించాలనే పిటిషన్లు కొట్టివేత.

⦁ భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం.. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని సంచలన తీర్పు

⦁ రఫేల్​ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్​ గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్​ కొట్టివేత

Last Updated : Nov 15, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details