తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమిలి ఎన్నికలపై నేడు అఖిలపక్ష భేటీ

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక', 75వ స్వాతంత్య్ర వేడుకలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.

By

Published : Jun 19, 2019, 5:50 AM IST

Updated : Jun 19, 2019, 7:54 AM IST

జమిలి ఎన్నికలపై నేడు అఖిలపక్ష భేటీ

జమిలి ఎన్నికలపై నేడు అఖిలపక్ష భేటీ

లోక్​సభ సహా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశమై నేడు అఖిల పక్ష భేటీ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ మేరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖలు రాశారు.

సమావేశంలో కీలక అంశాలు

  • పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించడం.
  • ఒకే దేశం- ఒకే ఎన్నిక
  • 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు
  • మహాత్మాగాంధీ 150వ జయంతి నిర్వహణ
  • వెనుకబడిన జిల్లాల అభివృద్ధి

ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని కేంద్రం తన లేఖలో పేర్కొంది.

ఇదీ చూడండి: ప్రధానితో భేటీకి వచ్చేదిలేదు: మమతా బెనర్జీ

Last Updated : Jun 19, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details