సెప్టెంబర్ 17న జన్మదినాన స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సర్దార్ సరోవర్ ఆనకట్టను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 'నమామి దేవి నర్మదే మహోత్సవ్'కు రావాలన్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు మోదీ.
భాజపా కార్యాలయంలో చిత్రప్రదర్శన...
ప్రధానమమంత్రిగా నరేంద్రమోదీ సాధించిన విజయాల చిత్రాల ప్రదర్శనను భాజపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు పాల్గొననున్నారు. ఆర్టికల్ 370 రద్దు నుంచి ముమ్మారు తలాక్ రద్దు వంటి విజయాల చిత్రమాలికను ఉంచనున్నారు. ఇస్రో ఛైర్మన్ శివన్‌కు కౌగిలింత ఇచ్చిన చిత్రానికి ఈ ప్రదర్శనలో చోటు దక్కనుంది.