కరోనా వైరస్ దృష్ట్యా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని న్యాయస్థానాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపట్టాయి. దిగువస్థాయి న్యాయస్థానాల్లో వర్చువల్ సౌకర్యాలను పెంచేందుకు గానూ.. 2,506 కోర్టులకు నిధులు విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. ఆయా భవనాల్లో వీడియో కాన్ఫరెన్స్ క్యాబిన్లను ఏర్పాటుచేయాలని సూచిందింది.
వీడియో కాన్ఫరెన్స్ క్యాబిన్ల ఏర్పాటు కోసం గత సెప్టెంబర్లోనే సుమారు రూ.5.21కోట్ల నిధులను విడుదల చేశాయి సుప్రీంకోర్టు ఈ-కమిటీ, న్యాయశాఖలు. మలి విడతలో భాగంగా హార్డ్వేర్ పరికరాలు, మానిటర్స్, కేబుల్స్ వంటి వాటికి అక్టోబర్లో మరో రూ. 28.886 కోట్లు అందించాయి.
ఆన్లైన్వైపే మొగ్గు..