తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేషన్​ కార్డు ఉంటే సంక్రాంతికి రూ.వెయ్యి, చీర ఫ్రీ! - palaniswamy schemes

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది. రేషన్​ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు 'సంక్రాంతి కానుక'గా అందించాలని నిర్ణయించింది. చీరలు, పంచెలు, పాయసం చేసేందుకు కావల్సిన సామగ్రిని పండుగ కానుకగా అందిచనుంది.

tamilnadu pongal gift details
రేషన్​ కార్డు ఉంటే సంక్రాంతికి రూ.వెయ్యి, చీర ఫ్రీ!

By

Published : Nov 29, 2019, 2:05 PM IST

Updated : Nov 29, 2019, 2:27 PM IST

పొంగల్(సంక్రాంతి) పండుగ సందర్భంగా తమిళనాడులోని పేదలకు ప్రత్యేక కానుకలు అందించాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. ఇందుకోసం రూ.2363.13 కోట్లు కేటాయించింది.

రేషన్​ కార్డు ఉన్న కుటుంబం రూ. 1000/- తో పాటు.. పాయసం సామగ్రి, మహిళలకు చేనేత చీరలు, పురుషులకు చేనేత పంచెలు కానుకగా అందించనున్నారు.

పండుగ రోజు నోరు తీపి చేసుకునేందుకు పొంగల్​ తయారీకి కావల్సిన సామగ్రిని రేషన్​ దుకాణంలో ఉచితంగా పంచనున్నారు. ఈ గిఫ్ట్​ ప్యాక్​లో ఒక కిలో బియ్యం, కిలో చక్కెర, 20 గ్రాముల జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 5 గ్రాముల యాలకులు ఉంటాయి. శుభసూచకంగా భావించే 2 అడుగుల పచ్చని చెరకు గడను కూడా ఇందులో అందించనున్నారు.

ఇదీ చదవండి:గాడ్సే వ్యాఖ్యలపై సాధ్వీ క్షమాపణలు- విపక్షాలతో స్పీకర్​ భేటీ

Last Updated : Nov 29, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details