తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు, కర్ణాటకలో కరోనా విజృంభణ - కరోనా కేసులు వివరాలు

కరోనా మహమ్మారి దేశంలో అంతకంతకూ విజృంభిస్తోంది. ఇవాళ తమిళనాడులో రికార్డు స్థాయిలో 4,538 కేసులు నమోదయ్యాయి. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, కర్ణాటక​లోనూ బాధితులు పెరుగుతున్నారు.

TN records 79 COVID-19 deaths, 4,538 fresh cases
తమిళనాడులో ఒక్కరోజే 4,538 మందికి కరోనా

By

Published : Jul 17, 2020, 8:07 PM IST

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది.

తమిళనాడులో రికార్డు స్థాయిలో కేసులు

తమిళనాడులో రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 4,538 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 79 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2,315కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 60వేల 907 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 47,782 మంది చికిత్స పొందుతున్నారు.

  • కర్ణాటకలోనూ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం మరో 3,693 మంది కొవిడ్​ బారినపడ్డారు. రాష్ట్రంలో ఒక్కరోజే 115 మరణాలు నమోదయ్యాయి.
  • ఉత్తరప్రదేశ్​లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 1,919 కేసులు నమోదవ్వగా... మొత్తం బాధితుల సంఖ్య 45,363కి చేరింది. వెయ్యి మందికి పైగా మరణించారు.
  • దిల్లీలో 1462 కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి.
  • కేరళలో కొత్తగా 791 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 10 వేల మార్కును దాటాయి.

ఇదీ చూడండి:ఆ 'గోల్డ్​ మ్యాన్'​ మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details