తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రి పీఏ కిడ్నాప్​- 3 గంటల తర్వాత రిలీజ్ - తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి

తమిళనాడు తిరుపూర్​లో పట్టపగలే కొందరు దుండగులు మంత్రి ఉడుములై రాధాకృష్ణన్​ పీఏను అపహరించారు. మంత్రి కార్యాలయం నుంచి కిడ్నాప్​ చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 3 గంటల తర్వాత విడిచిపెట్టి.. నిందితులు పరారయ్యారు.

TN Minister's PA kidnapped shocking CCTV visuals
పట్టపగలే మంత్రి గారి పీఏ కిడ్నాప్​!

By

Published : Sep 23, 2020, 3:10 PM IST

Updated : Sep 23, 2020, 6:15 PM IST

తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి ఉడుములై రాధాకృష్ణన్​ పీఏ కర్ణన్​ను నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారు. ఉడుములై అన్సారీ రోడ్డులోని మంత్రి కార్యాలయం నుంచే బుధవారం 11.30 గంటల సమయంలో ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

మంత్రి పీఏను ఎత్తుకెళ్లిన దుండగులు

దాదాపు 3 గంటల తర్వాత.. అపహరించిన చోటు నుంచి 10 కి.మీ. దూరంలో కర్ణన్​ను విడిచిపెట్టి కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ వ్యక్తిని ఎందుకు తీసుకెళ్లారో ఇంకా తెలియలేదు.

ఉడుములై రాధాకృష్ణన్​ పీఏ కర్ణన్

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.

Last Updated : Sep 23, 2020, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details