తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైద్య విద్య రిజర్వేషన్​ బిల్లు'కు గవర్నర్​ ఆమోదం

తమిళనాడులో వైద్య విద్య రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు గవర్నర్​ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. బిల్లు ఆమోదంలో ఆయన ఆలస్యం చేస్తున్నారని ఇటీవల డీఎంకే సహా ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే భన్వరీలాల్​ పురోహిత్​ తన సమ్మతి తెలిపారు.

TN Guv clears 7.5 per cent quota Bill, govt school students to get preference in medical admissions
'వైద్య విద్య రిజర్వేషన్​ బిల్లు'కు గవర్నర్​ ఆమోదం

By

Published : Oct 30, 2020, 2:29 PM IST

తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్య​ విద్యలో 7.5 శాతం అంతర్గత రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్ర గవర్నర్​ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆమోదం తెలిపారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.

బిల్లుకు సంబంధించి గవర్నర్.. సొలిసిటర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా నుంచి న్యాయ సలహా కోరారు. సెప్టెంబర్​ 26న లేఖ రాయగా.. అక్టోబర్​ 29న సమాధానం వచ్చినట్లు రాజ్​భవన్​ ఓ ప్రకటనలో తెలిపింది. సొలిసిటర్​ జనరల్​ తన వైఖరి వెల్లడించిన తక్షణమే.. గవర్నర్​ బిల్లుకు ఆమోదించినట్లు స్పష్టం చేసింది.

నిరసనల నడుమ..

ఈ బిల్లుకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం.. దానిని గవర్నర్​కు సిఫారసు చేశారు. అయితే దీనిపై 6 వారాలకుపైగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు.

గవర్నర్​ కావాలనే ఈ బిల్లు ఆమోదంలో ఆలస్యం చేస్తున్నారని.. డీఎంకే సహా ఇతర విపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బిల్లుకు గవర్నర్​ ఆమోదముద్ర వేశారు.

ఇదీ చూడండి: రాజ్​భవన్​ ఎదుట డీఎంకే భారీ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details