జాతీయ విద్యా విధానం-2020లో కేంద్రం ప్రతిపాదించిన మూడు భాషల సూత్రాన్ని(ప్రాంతీయ భాష, ఆంగ్లం, హిందీ) తమిళనాడులో అమలుచేసేది లేదన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి. అన్నాడీఎంకే పార్టీ అందుకు అంగీకరించదని స్పష్టం చేశారు.
తమిళనాడు... దశాబ్దాలుగా రెండు భాషల( తమిళం, ఆంగ్లం) సూత్రాన్నే పాటిస్తోంది. ఇకపై కూడా ఆ రెండు భాషల్లోనే బోధన కొనసాగిస్తుందని, అందులో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పారు పళనిస్వామి. ప్రాంతీయ భాష, ఆంగ్లంతో పాటు కచ్చితంగా హిందీ భాషలో బోధించమని రాష్ట్రాలను ఆదేశించడపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు.