తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఇంటిని జయలలిత స్మారకంగా మార్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు ప్రజలు అమ్మగా భావించే జయలలిత జ్ఞాపకార్థం చెన్నై పోయెస్ గార్డెన్లోని ఆమె నివాసం 'వేద నిలయాన్ని' స్మారకంగా మారుస్తామని ఇదివరకే ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి పళణిస్వామి. ఇప్పుడు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం.