తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్తి 2జీ స్ప్రెక్టమ్- అప్పులేమో రాష్ట్ర బడ్జెట్ - elections 2019

ఆస్తి రూ.1.76 లక్షల కోట్లు. అప్పులు రూ.4 లక్షల కోట్లు. ఎన్నికల సంఘానికి తమిళనాడులో ఓ ఎమ్మెల్యే అభ్యర్థి సమర్పించిన వివరాలివి. ఇలా చేయడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది.

జబమాని మోహన్ రాజ్

By

Published : Apr 4, 2019, 8:22 PM IST

ఆస్తి 2జీ స్ప్రెక్టమ్- అప్పులేమో రాష్ట్ర బడ్జెట్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు విచారించిన పోలీసు అధికారి జబమాని మోహన్​రాజ్.. పెరంబూదూర్ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. నామినేషన్​తో సమర్పించిన ఆస్తులు, అప్పుల చిట్టా అందరినీ ఆలోచింపజేసింది.

ప్రమాణ పత్రంలో పేర్కొన్న దాని ప్రకారం ఆయన ఆస్తులు రూ.1.76 లక్షల కోట్లు. అప్పులు రూ. 4 లక్షల కోట్లు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కోడనాడ్ ఎస్టేట్​లో రూ.1500 కోట్లు విలువైన 600 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

అవగాహన కోసమే...

67ఏళ్ల మోహన్​రాజ్​ ప్రస్తావించిన అంకెలకు ఓ ప్రాముఖ్యం ఉంది. కాంగ్రెస్ హయాంలో సంచలనం సృష్టించిన 2జీ స్ప్రెక్టమ్ కుంభకోణం విలువ రూ.1.76 లక్షల కోట్లు. ప్రపంచ బ్యాంకులో తమిళనాడు ప్రభుత్వ అప్పులు రూ. 4 లక్షల కోట్లు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలా చేశానంటున్నారు మోహన్.

ఇవీ చూడండి:

ఎన్నికల ప్రమాణ పత్రంలో తప్పుడు వివరాలు ఇచ్చినా అభ్యర్థులపై చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు మోహన్. 2009లో ఇలానే చేసినా.... కనీసం నోటీసైనా రాలేదన్నది ఆయన మాట. అఫిడవిట్​లో తప్పుడు వివరాలు ఇవ్వడం ఒకప్పుడు క్రిమినల్ నేరమైనా... 2014 ఏప్రిల్​లో సివిల్ కేసుగా మార్చడాన్ని గుర్తుచేశారు మోహన్​ రాజ్. తమిళనాడుకు చెందిన ఓ అగ్రనేతను కాపాడేందుకు ఆ మార్పులు చేశారని ఆరోపించారు.

"ప్రమాణ పత్రంలో తప్పుడు వివరాలు ఇచ్చాను. నాకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.23 వేల పింఛన్ వస్తోంది. నా ఖాతాలో ఎంత ఉందో కూడా విచారణ చేయరు. నేను సీబీఐలోనూ పని చేశాను. అప్పుడు రూ.5 లంచం అడిగిన రైల్వే టీటీఈని.. అరెస్టు చేసి కటకటాలపాలు చేశాను. లక్షల కోట్లు తినేస్తున్న కొందరు నేతలు మాత్రం యథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అలా ఉన్నాయి. చట్టం ఎలా పని చేస్తుందో ప్రజలు తెలుసుకోవాలి."
-జబమాని మోహన్ రాజ్, పెరంబుదూర్ అభ్యర్థి

భార్య వద్ద రూ. 2.5 లక్షలు విలువైన బంగారం, రూ. 20 వేల నగదు ఉన్నాయని తెలిపారు మోహన్.

ఇప్పటికి మోహన్​రాజ్​ 13 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా.. విజయం మాత్రం సాధించలేదు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details