తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడి సమీపంలో 1500 ఏళ్ల నాటి సొరంగం - ancient underground tunnel news

తమిళనాడులో 1500 ఏళ్లనాటి సొరంగం బయటపడింది. బృహదీశ్వర్​ ఆలయ సమీపంలో కాలువ పునరుద్ధరణ ప్రక్రియలో అధికారులు దీనిని కనుగొన్నారు.

1500 years old underground tunnel discovered, renovation process underway
తంజావూరులో బయటపడిన 1500ఏళ్లనాటి సొరంగం

By

Published : Oct 9, 2020, 4:41 PM IST

తంజావూరులో బయటపడిన 1500ఏళ్లనాటి సొరంగం

తమిళనాడు తంజావూరులో 15 వందల ఏళ్ల నాటి సొరంగాన్ని అధికారులు కనుగొన్నారు. బృహదీశ్వర్​ ఆలయ సమీపంలో కార్పొరేషన్​ అధికారులు కాలువ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా ఈ సొరంగం బయటపడింది.

దీంతో పురాతత్వ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు... సొరంగం 1500 ఏళ్ల నాటిదని నిర్ధరించారు. దీనిపై పరిశోధనలు ప్రారంభించారు.

క్రీస్తు పూర్వం 846-1225 మధ్య కాలంలో చోళులు తంజావూరును పరిపాలించారని చరిత్ర చెబుతుంది. ఈ కాలంలో అనేక దేవాలయాలను చోళ రాజులు నిర్మించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఉపాధి కోసం 60 ఏళ్ల మహిళల 'సాగర సాహసాలు'

ABOUT THE AUTHOR

...view details