తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దీదీ.. మీ 40 మంది ఎమ్మెల్యేలు నావైపే'

ప్రధాని నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. బంగాల్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 40 మంది తృణమూల్​ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్​ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.

By

Published : Apr 29, 2019, 6:18 PM IST

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

40 మంది తృణమూల్​ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని ప్రధాని నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. బంగాల్​లో భాజపా అధికారంలోకి వస్తే టీఎంసీ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.

బంగాల్​లోని శ్రీరాంపుర్​లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు మోదీ. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి.. పదుల సంఖ్యలో ఎంపీలతో దిల్లీ పీఠం ఎక్కాలని ఆశపడుతున్నారని ఎద్దేవా చేశారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"దీదీ.. మీ కింద భూమి కదిలిపోతోంది. చూడండి.. 23న ఫలితాలు రాబోతున్నాయి. అన్ని వైపుల నుంచి కమలం చుట్టుముడుతుంది. ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర నుంచి పారిపోతారు. ఇప్పటికే 40 మంది తృణమూల్​ ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. దీదీ.. దిల్లీ చాలా దూరంలో ఉంది. ఈ విషయం దీదీకి కూడా తెలుసు. అసలు విషయమేమిటంటే... దిల్లీలో తాను, బంగాల్​లో అల్లుడు ఉండాలన్నదే ఆమె ప్రణాళిక."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మమత మేనల్లుడు, డైమండ్​ హార్బర్​ నియోజకవర్గ అభ్యర్థి అభిషేక్​ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

దీదీపై మోదీ చురకలు

ఓటమి భయంతో మమత నియంత్రణ కోల్పోతున్నారని విమర్శించారు మోదీ. అపజయం ఖాయమని భావించే ఈవీఎంలను తప్పుబడుతున్నారని అన్నారు. పోలింగ్​ సమయంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపించారు మోదీ.

మహనీయులు పుట్టిన మట్టి

మోదీకి మట్టి, రాళ్లతో చేసిన రసగొల్లాను పంపుతానన్న దీదీ మాటలపై మోదీ స్పందించారు. మహనీయులు పుట్టిన మట్టితో చేసిన రసగొల్లాలను ప్రసాదంగా భావిస్తానన్నారు.

ఇదీ చూడండి:'మోదీకి కుల రాజకీయ రంగు పులమొద్దు'

ABOUT THE AUTHOR

...view details