బంగాల్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు పూజలు, ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుష్రత్ జహాన్ దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని చర్చనీయాంశమయ్యారు. ముస్లిం అయిన ఆమె పూజలు చేయడంపై రెండు వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా మరోమారు పూజలకు హాజరయ్యారు నుష్రత్ జహాన్. విమర్శలను లెక్కచేయకుండా కోల్‌కతాలోని చట్లబగన్ దుర్గా మండపంలో ఏర్పాటు చేసిన 'సిందూర్ ఖేలా' కార్యక్రమంలో పాల్గొన్నారు. భర్త నిఖిల్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.