తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' చట్టాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంలో వ్యాజ్యం - పౌరసత్వ చట్ట సవరణను సవాల్​ చేస్తూ సుప్రీంలో వ్యాజ్యం

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్రా పౌరసత్వ చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలన్న ఆమె విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

TMC MP Mahua Moitra moves SC challenging amended Citizenship Act
'పౌర' చట్టాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంలో వ్యాజ్యం

By

Published : Dec 13, 2019, 2:20 PM IST

పౌరసత్వ చట్ట సవరణను సవాల్​ చేస్తూ తృణమూల్​ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు సుప్రీంకోర్టు నిరాకరించగా... డిసెంబర్ 16న అయినా వాదనలు ఆలకించాలని మహువ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు.

మరో మూడు పిటిషన్లు

పౌరసత్వ చట్ట సవరణను సవాల్​ చేస్తూ ఇప్పటికే ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​, రెండు స్వచ్ఛంద సంస్థలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. మతం ఆధారంగా పౌరసత్వం కల్పించడాన్ని పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇదీ చూడండి:'ఈశాన్యం నుంచి దృష్టి మరల్చేందుకే 'రేప్'​పై దుమారం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details