తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాకూటమి వస్తే నోట్ల రద్దుపై దర్యాప్తు: మమత

లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే పెద్ద నోట్ల రద్దుపై విచారణ చేపడతామని ప్రకటించారు.

By

Published : Mar 27, 2019, 6:01 PM IST

Updated : Mar 27, 2019, 7:50 PM IST

నోట్ల రద్దుపై విచారణ చేపడతాం : మమతా బెనర్జీ

మహాకూటమి వస్తే నోట్ల రద్దుపై దర్యాప్తు: మమత
కేంద్రంలో విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే 2016లో జరిగిన నోట్ల రద్దుపై విచారణ చేపడతామన్నారు బంగాల్​ సీఎం, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోను ఆమె విడుదల చేశారు.

ప్రణాళికా సంఘాన్ని మళ్లీ తీసుకొస్తాం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రద్దు చేసిన ప్రణాళిక సంఘాన్ని పునరిద్ధరిస్తామని హామీ ఇచ్చారు మమతా బెనర్జీ. 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచడం, జీతాల పెంపు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ విధానాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడితేనే దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రజల చౌకీదార్లనే గౌరవిస్తాం

ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మోదీ ప్రభుత్వంపై మమత తీవ్ర విమర్శలు చేశారు. నిజమైన చౌకీదారులను తాను గౌరవిస్తానని, రాజకీయ చౌకీదారులను కాదని అన్నారు. పార్టీ సీనియర్​ నేతల పట్ల భాజపా ప్రవర్తన బాధాకరమని తెలిపారు. ఎల్​కే అడ్వాణీతో మాట్లాడినట్టు మమత వెల్లడించారు.

Last Updated : Mar 27, 2019, 7:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details