బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.. దిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలికింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ విన్నవించింది.
కేజ్రీవాల్ పార్టీకి మద్దతుగా టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రెయిన్.. ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభ్యర్థి రాఘవ్, సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని కోరారు.