ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 12 మంది తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం బుధవారం సమావేశమయ్యారు. పశ్చిమ్ బంగ పేరును ‘బంగ్లా’గా మార్చుతూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని మోదీని కోరారు.
ఈ మేరకు ప్రధాని మోదీకి వినతి పత్రం అందజేశారు టీఎంసీ నేతలు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని బంగాల్ శాసనసభ ఆమోదించిందని తెలిపారు.
1000 ఏళ్ల చరిత్ర
ఇదే అంశాన్ని టీఎంసీ ఎంపీ సుఖెందు శేఖర్ రాయ్ కూడా రాజ్యసభలో లేవనెత్తారు. భౌగోళికంగా దేశంలో ‘తూర్పు బంగాల్’ అనే ప్రాంతం ఎక్కడా లేనందున తమ రాష్ట్రానికి పశ్చిమ్ బంగ అనే పేరు అనవసరమని, దాన్ని ‘బంగ్లా’గా మార్చాలని కోరారు. బంగ్లా అనేది బంగా అనే పదం నుంచి వచ్చిందని, ఇది వెయ్యేళ్ల క్రితం స్థిరపడ్డ ఓ ద్రవిడ తెగ పేరని వివరించారు.