ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు సీఎం పీఠం తమదేనంటూ భాజపా సవాల్ విసురుతోంటే... అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పటి ప్రత్యర్థి అయిన వామపక్షాల సాయాన్నీ కోరుతోంది.
"కాంగ్రెస్-వామపక్షాల కూటమి నిజంగా భాజపా వ్యతిరేకులైతే వారు తప్పకుండా మమతా బెనర్జీకి మద్దతుగా నిలవాలి. కుల రాజకీయాలకు అడ్డు చెప్పేందుకు మమత చేస్తోన్న పోరాటంలో అండగా ఉండాలి."
-సౌగతా రాయ్, తృణమూల్ ఎంపీ.
ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన పథకాలేవీ సఫలం కాలేదని రాయ్ పేర్కొన్నారు. బంగాల్లో కలకలం సృష్టించిన పశువుల అక్రమ రవాణాపై స్పందించిన రాయ్... ఇది కేవలం రాష్ట్ర పోలీసులకు సంబంధించిన సమస్య కాదని, కేంద్రం అధ్వర్యంలో పనిచేసే బీఎస్ఎఫ్ సైనికులు దాన్ని అడ్డుకోవాలని అన్నారు. ఇదే విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ధ్వజమెత్తారు. "సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ సైనికులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారో లేదా చూడాలి కానీ, రాష్ట్రాల్లో పర్యటిస్తూ భోజనంపై శ్రద్ధ పెట్టడం ఏంటి?" అని ఎద్దేవా చేశారు.
సిసిర్ అధికారిపై వేటు....