తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆకులతో అద్భుతాలు- కేరళ యువతి కళకు ఫిదా - ఆకులపై అద్భుతాలు

కరోనా కారణంగా ఎంతో మంది జీవితాలు తలకిందులయ్యాయి. లాక్​డౌన్​తో నెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీనివల్ల కొంత మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటే.. మరికొందరు మాత్రం తమలోని కళకు పదునుపెట్టారు. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేరళకు చెందిన అఖిల కూడా 'లీఫ్​ ఆర్ట్​'లో రాటు దేలింది. ఆకులతో అద్భుతాలు సృష్టిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ప్రముఖుల చిత్రాలు గీస్తూ ఇన్​స్టాలో ప్రశంసలు అందుకుంటోంది.

Titled 'Akhilart', leaf art by Malappuram girl becomes a hit on Instagram
ఆకులతో అద్భుతాలు..కేరళ యువతికి కళకి ఇన్​స్టా ఫిదా

By

Published : Oct 12, 2020, 2:29 PM IST

ఆకులతో అద్భుతాలు.. కేరళ యువతి కళకు ఫిదా

కరోనా మహమ్మారి కారణంగా మన జీవన విధానంలో పెనుమార్పులు సంభవించాయి. లాక్​డౌన్​ వల్ల ఎన్నో బాధలు అనుభవించారు ప్రజలు. చివరకు పాఠశాలలకు వెళ్లి ఉల్లాసంగా గడిపే విద్యార్థులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్​లైన్​ తరగతుల ద్వారా వారికి ఇళ్లలోనే బోధిస్తున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఎంతో మంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకుంటున్నారు. తమలోని కళకు పదునుపెడుతున్నారు. కేరళ మలప్పురం జిల్లా కుట్టిప్పురంలోని అఖిల కూడా ఆ కోవలోకే వస్తుంది. తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించి.. ఆకులతోనే అద్భుతాలు సృష్టిస్తోంది.

మలప్పురంలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ సైకాలజీ ఫైనల్ ఇయర్​ చదువుతోంది అఖిల. లాక్​డౌన్​లో దొరికిన ఖాళీ సమయంలో ఆకులతో కళాకృతులు చేయడంపై దృష్టి సారించింది. కొద్ది రోజుల్లోనే ఆ కళలో ఆరితేరింది. మర్రి, రావి, టేకు, పనస చెట్ల ఆకులతో అద్భుత కళాఖండాలు చెక్కింది. ప్రముఖుల చిత్రాలను ఆకులపైనే గీసింది. అఖిల కళా నైపుణ్యానికి ఇన్​స్టాలో అనేక మంది దాసోహమయ్యారు. ఆమె పేజీని అనుసరించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

జాతిపిత మహాత్మా గాంధీ, నటుడు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్​, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గాయని చిత్ర వంటి ప్రముఖుల చిత్రాలను ఆకులపైనే గీసి అబ్బుర పరిచింది అఖిల. వీటిని ఆమె కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవంలో ప్రదర్శించగా.. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చూసి మంత్ర ముగ్దులయ్యారు. ఆమెలో దాగి ఉన్న ప్రతిభను కొనియాడారు.

లీఫ్​ ఆర్ట్​తో పాటు శాస్త్రీయ సంగీతం, పెన్సిల్​తో కళాకృతులు చేయడం, ఇతర కళల్లోనూ అఖిలకు మంచి నైపుణ్యం ఉంది.

ABOUT THE AUTHOR

...view details