కరోనా వైరస్ను నియంత్రించేందుకు తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయత్నం చేసింది. తెన్నంపాలయం మార్కెట్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా క్రిమిసంహారక సొరంగం ఏర్పాటు చేసింది.
"మేము తిరుప్పూర్లోని తెన్నంపాలయం మార్కెట్లో మొదటిసారి క్రిమిసంహారక సొరంగం ఏర్పాటు చేశాం. ప్రజలు మార్కెట్లోని ప్రవేశించే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. తరువాత ఈ టన్నెల్ గుండా 3-5 సెకెన్ల పాటు నడవాలి. ఇందుకు సహకరిస్తున్న తిరుప్పూర్ ప్రజలకు ధన్యవాదాలు." - కె.విజయ కార్తికేయన్, తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ ట్వీట్
రైతు బజార్లో ఏర్పాటు చేసిన ఈ కరోనా సంహారక సొరంగం తిరుప్పూర్ జిల్లా చరిత్రలో ఒక మైలు రాయిగా మిగిలిపోతుందన్నారు కలెక్టర్ విజయ కార్తికేయన్.