తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పది' పరీక్షకు గుర్రంపై కేరళ ఝాన్సీరాణి - ssc

పరీక్ష రాసేందుకు ఎవరైనా ఎలా వెళ్తారు? కారులోనో, బస్సులోనే, బైక్​పైనో. పరీక్ష కేంద్రం మరీ దగ్గరైతే నడిచి వెళ్తారు. కేరళలో ఓ బాలిక మాత్రం గుర్రంపై దూసుకెళ్లింది. ఎందుకలా?

'పది' పరీక్షకు గుర్రంపై కేరళ ఝాన్సీరాణి

By

Published : Apr 10, 2019, 11:52 AM IST

'పది' పరీక్షకు గుర్రంపై కేరళ ఝాన్సీరాణి

సరదా కోసమో, వ్యాయామం కోసమో గుర్రపు స్వారీ చేయడం సాధారణమే. కానీ కేరళ త్రిస్సూర్​కు చెందిన ఈ బాలిక చేస్తున్న సవారీకి ఓ ప్రత్యేకత ఉంది. పదోతరగతి చివరి బోర్డు పరీక్ష రాయడానికి గుర్రంపై బయలుదేరింది కృష్ణ.

సాధారణ మహిళలూ గుర్రపు స్వారీ చేయగలరని నిరూపించేందుకే ఇలా చేశానని చెబుతోంది కృష్ణ.

" నేను ఏడో తరగతి చదువుకునే రోజుల్లోనే గుర్రపు స్వారీ మొదలుపెట్టా. నా స్నేహితుల్లో ఒకరు గుర్రపు స్వారీ చేయడం సాధారణ మహిళలకు సాధ్యం కాదు, ఝాన్సీరాణి వంటి వీరవనితలకు మాత్రమే సాధ్యమని నాతో అన్నారు. సాధారణ మహిళలూ గుర్రపు స్వారీ చేయగలరని నిరూపించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. శిక్షణ కోసం తల్లిదండ్రుల నుంచి అనుమతి అవసరమని మా గురువు చెప్పారు. మా నాన్న నా కోసం 6 నెలల తెల్ల గుర్రాన్ని తీసుకొచ్చారు. దానితోనే శిక్షణ ప్రారంభించా. అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గుర్రంపై ప్రయాణం చేస్తా"
-కృష్ణ, త్రిస్సూర్​

తన విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనని తెలిపింది కృష్ణ. మహిళలు తలచుకుంచే ఏదైనా సాధించగలరు అని రుజువు చేసినందుకు ఆనందం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: భారత్​ భేరి: 70 వసంతాల ఓటు ప్రస్థానం

ABOUT THE AUTHOR

...view details