ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు 2 నెలలు తీరికలేకుండా గడిపిన ప్రధాని నరేంద్రమోదీ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ సమీపంలోని పవిత్ర రుద్ర గుహకు చేరుకునేందుకు రెండు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేశారు. మార్గమధ్యలో యాత్రికులకు అభివాదం చేశారు.
రుద్ర గుహలో కొన్ని గంటలపాటు యోగ ముద్రలో గడపనున్నారు మోదీ. రేపు ఉదయం వరకు అదే స్థితిలో ఉంటారని సమాచారం. గుహలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ధ్యానం ఆరంభంలో కొన్ని దృశ్యాలు చిత్రీకరించేందుకు అంగీకరించారు.