లోకం తెలియని పసిపాపకు, పర్వతమంత ఓ గజరాజుకు మధ్య స్నేహం కుదిరింది. క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారి స్నేహం అపూర్వం.
గజరాజుతో చిన్నారి దోస్తీ.. నెట్టింట వైరల్ కేరళలోని తిరువనంతపురానికి చెందిన మహేష్‌కు ఏనుగులు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఎనిమిదేళ్ల క్రితం ఉమాదేవి అనే ఓ ఏనుగును కొనుక్కున్నారు. దాని సంరక్షణ కోసం అట్టింగల్ గ్రామానికి చెందిన కుట్టన్, అతని కుమారుడు శ్రీకుట్టన్లను మావటీలుగా నియమించారు.
పుట్టుకతోనే చిగురించిన స్నేహం
మహేష్ కుమార్తె భామకు ఈ ఏనుగుతో స్నేహం కుదిరింది. తన కళ్ల ఎదుటే పుట్టి, పెరుగుతున్న రెండేళ్ల చిన్నారి భామ అంటే ఉమాదేవికి (ఏనుగు) వల్లమాలిన ప్రేమ. ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. చిన్నారి తనకెంతో ఇష్టమైన ఏనుగుకు పండ్లు, బిస్కెట్లు తినిపిస్తుంటుంది. వీరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇదీ చూడండి:గజరాజుకు గండం- తగ్గిపోతున్న సంఖ్య