తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భగత్ సింగ్​​నీ 'ఆందోళన్​ జీవి' అంటారా?' - భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ తికాయత్

రైతు ఉద్యమంలో కొందరు విదేశీ శక్తులు, సరికొత్త ఆందోళన్​ జీవులు ఉన్నారన్న ప్రధాని మోదీ వాఖ్యలపై భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ తికాయత్​ మండిపడ్డారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్​ సింగ్​ కూడా ఆ కోవకే చెందుతారా? అని ప్రశ్నించారు.

-FARMERS-TIKAIT
'భగత్ సింగ్​​ కూడా అలాంటి వ్యక్తేనా?'

By

Published : Feb 10, 2021, 5:22 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను 'సరికొత్త ఆందోళన్​ జీవులు' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించడంపై భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ తికాయత్​ మండిపడ్డారు. మరి దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్​సింగ్​ కూడా ఆ కోవకే చెందుతారా? అని ప్రశ్నించారు.

కురుక్షేత్ర సభలో మాట్లాడుతోన్న రైతునేత రాకేశ్​ తికాయత్​

హరియాణాలోని కురుక్షేత్ర గుంప్తల గర్హూ గ్రామంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తికాయత్​ ప్రసంగించారు. రైతుల గురించి కేంద్రం తప్పుగా మాట్లడుతోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించకుండా తికాయత్​ విమర్శలు గుప్పించారు.

"రైతు ఉద్యమాలు చేసేవారిలో కొందరు విదేశీ శక్తులు, సరికొత్త ఆందోళన్​ జీవులు ఉన్నారని పార్లమెంట్​లో ఒకాయన అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్​ సింగ్​ లాంటి వ్యక్తులు కూడా పరదేశీయులేనా? వాళ్లు కూడా కొత్త ఆందోళన్​ జీవులేనా?"

-రాకేశ్ తికాయత్, భారతీయ కిసాన్​ యూనియన్​ నేత

రైతు ఉద్యమంలో చనిపోయిన 150 మంది రైతులు విదేశీయులేనా? అని ప్రశ్నించారు తికాయత్​. నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేంత వరకు తమ ఆందో ళనను విరమించమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:మోదీ కంటతడి- ఆజాద్​కు సెల్యూట్​!

ABOUT THE AUTHOR

...view details