నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తిహార్ జైలు పాలన విభాగం సూచించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు తిహార్ కారాగారం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు. ఈ గడువులోపు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోకపోతే తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు.
నిర్భయ దోషులకు తిహార్ జైలు అధికారుల నోటీసులు - Tihar jail officials issues notice to Nirbhaya Convicts for mercy petition
నిర్భయ కేసు నిందితులకు తిహార్ జైలు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉరిశిక్షపై వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. లేదంటే తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
![నిర్భయ దోషులకు తిహార్ జైలు అధికారుల నోటీసులు Tihar jail officials issues notice to Nirbhaya Convicts for mercy petition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5420042-108-5420042-1576710585643.jpg)
నిర్భయ దోషులకు తిహాడ్ జైలు అధికారుల నోటీసులు
'ఉరి'పై జనవరి 7కు వాయిదా
అంతకుముందు ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయటంపై తీర్పును దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7కు వాయిదా వేసింది. మరణశిక్ష అమలుకు ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తిహార్ జైలు అధికారులు దోషులకు సూచించారు.
Last Updated : Dec 19, 2019, 7:10 AM IST