దేశ రాజధాని దిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో ఓ ఆడ పులి కిడ్నీ ఫెయిలై మరణించింది. జంతువులకూ కరోనా వచ్చే ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దాని నమూనాలను కరోనా పరీక్షలకు పంపించారు జూ అధికారులు.
ఫలితం నెగిటివ్
కల్పన అనే 14 ఏళ్ల ఆడ పులి బుధవారం మరణించింది. అధికారుల సమక్షంలో గురువారం ఖననం చేశారు. క్రియాటినిన్ స్థాయిలు పెరగడం (కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు జరుగుతుంది) వల్లే మరణించిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అనంతరం పులికి సంబంధించిన నమూనాలను యూపీ బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు జూ అధికారులు వెల్లడించారు.