అడవిలో బతకమని ఎన్నిసార్లు తీసుకెళ్లి వదిలినా... జనావాసాల్లోకి రావడం మానలేదు ఓ పులి. దీంతో విసుగెత్తిపోయిన అటవీ అధికారులు ఆ వన్యమృగాన్ని మధ్యప్రదేశ్లోని భోపాల్ 'వన్ విహార్ జాతీయ పార్కు'లో క్వారంటైన్లో ఉంచారు.
ఇద్దరు బలి
'సరన్'గా పిలిచే ఈ పులి మహారాష్ట్ర సరిహద్దుల్లోని జనావాసాల్లో తిరుగుతూ ఉండగా 2018లో గుర్తించారు. అప్పటికే ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టించిన ఈ పులి ఇద్దరు వ్యక్తులను బలి తీసుకుంది. అతి కష్టం మీద ఈ పులిని అటవీ అధికారులు 2018 డిసెంబరు 11న మధ్యప్రదేశ్లో పట్టుకుని సాత్పురా పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.