ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడిగులు పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గురువారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి 19 మంది మృతి చెందారు.
బిహార్‌లో 14 మంది
బిహార్‌లోని పలు జిల్లాల్లో పిడుగులుపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పట్నా, బెగుసరాయ్, ఖగారియా, పుర్నియా, భోజ్‌పుర్, వైశాలి, సుపౌల్ జిల్లాల్లో అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు.