తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇరుకైన దారిలో: జాలువారే సెలయేరు.. జారితే బేజారు - Mountainous road near the Sach Pass

మంచుతో నిండిన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు హిమాచల్ ప్రదేశ్‌. అందుకే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. ఎత్తైన కొండల్లో, వంపులు తిరిగిన దారుల్లో ప్రయాణం చాలా థ్రిల్లింగ్​గా ఉంటుంది. అయితే కొన్ని రహదారులు భయకరంగా ఉన్నా.. అలాంటి మార్గాల్లో ప్రయాణించేందుకు కొందరు ఔత్సాహికులు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాటిల్లో ఇదొకటి.

Sach Pass
సచ్​పాస్​

By

Published : Jun 9, 2020, 11:16 AM IST

హిమాచల్​ప్రదేశ్​లోని ఎత్తైన పర్వతాల్లో విహరించేందుకు చాలా మంచి పర్యటకులు ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది ఔత్సాహికులు ట్రెక్కింగ్​ వంటి ఫీట్లు చేస్తూ.. కొండలు ఎక్కుతుంటారు. అలాగే కొన్ని రహదారులు ప్రమాదకరంగా ఉన్నా.. ప్రయాణికులను మంచి థ్రిల్​కు గురిచేస్తాయి. అలాంటి వాటిల్లో ఇదొకటి. ఛంబా జిల్లాలోని సచ్​పాస్ సమీపంలో ఈ ప్రాంతం ఉంది. ఎత్తైన కొండ అంచుల్లో ఉన్న రహదారిలో.. ఒక్క వాహనం మాత్రమే వెళ్లే వీలుంటుంది. అయితే ఆ మార్గంలో ప్రయాణిస్తే.. జాలువారే సెలయేరుతో పాటు అందమైన కొండలు కనువిందు చేస్తాయి. అయితే ఇక్కడకు వెళ్లాలంటే కొన్ని రోజులే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపు 8-9 నెలలు మంచుతో కప్పబడి ఉంటుందట. ఇటీవలె ఓ రెవెన్యూ అధికారి కారులో వెళ్తూ దాన్ని చిత్రీకరించారు. ఆ వీడియో నెట్టింట పోస్టుచేయగా విశేషంగా ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details