మహరాష్ట్ర పాల్ఘడ్ జిల్లాలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కొందరు దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, 100మందిని అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది?
మహరాష్ట్ర పాల్ఘడ్ జిల్లాలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కొందరు దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, 100మందిని అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది?
'ముగ్గురు వ్యక్తులు ముంబయి నుంచి కారులో వస్తున్నారు. వారిని మహారాష్ట్ర పాల్ఘడ్ జిల్లాలోని ధబాడి, ఖాన్వెల్ మధ్యలో ఉన్న గాడ్చిన్చలే గ్రామస్థులు గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆపారు. ఆ ముగ్గుర్ని దొంగలుగా అనుమానించి, వారిపై రాళ్లదాడి చేశారు. చనిపోయేంతవరకు చితకబాదారు. కారును తీవ్రంగా ధ్వంసం చేశారు' అని పోలీసులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను శవపరీక్ష కోసం పాల్ఘడ్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:రోగికి సాయం కోసం బైక్పై 430కి.మీ ప్రయాణం