తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - jammu kashmir news

Encounter in Pulwama
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

By

Published : Jun 3, 2020, 10:38 AM IST

Updated : Jun 3, 2020, 11:24 AM IST

10:37 June 03

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా కంగన్​ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది.

ముష్కరులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా... జవాన్లు దీటుగా స్పందించారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్​ సంస్థకు చెందిన వారని అధికారులు తెలిపారు. వారిలో ఒక ఐఈడీ నిపుణులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Jun 3, 2020, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details