మరోసారి పాక్ తూట్లు...
సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాకిస్థాన్ తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్ కేరన్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాక్ సేనలు కాల్పులకు తెగబడ్డాయి. దాయాది కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఒక మైనర్ సహా మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
పౌరులే లక్ష్యంగా పాక్ సేనలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కాల్పులకు తెగబడ్డాయని అధికారులు తెలిపారు.