తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాలి బూడిదైన బస్సు.. ముగ్గురు సజీవ దహనం! - కాలి బూడిదైన బస్సు.. ముగ్గురు సజీవ దహనం!

కర్ణాటక తుమకూరులో ఓ ప్రైవేటు బస్సు, ఓమ్ని వ్యాను కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Three people burnt alive in Bus and van accident near gubbi, tumakuru, karnataka
కాలి బూడిదైన బస్సు.. ముగ్గురు సజీవ దహనం!

By

Published : Jan 4, 2020, 8:55 AM IST

Updated : Jan 4, 2020, 11:37 AM IST

కాలి బూడిదైన బస్సు.. ముగ్గురు సజీవ దహనం!

కర్ణాటక తుమకూరు​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గుబ్బి తాలూకా దొబ్బగుని సమీపంలో.. 206 జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు, ఓమ్ని వ్యాను ఢీకొన్నాయి. మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

బెంగళూరు నుంచి శివమొగ్గకు ప్రయాణిస్తున్న బస్సు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. నరసమ్మ అనే వృద్ధురాలు సహా 55 ఏళ్ల వయసున్న వసంతకుమార్, రామయ్య అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మగ పులి దాడిలో 'దామిని'కి గాయాలు.. మృతి

Last Updated : Jan 4, 2020, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details