తమిళనాడు చెన్నైలోని ఒక వ్యాపారి ఇంటిలోకి చొరబడిన దుండగులు కుటుంబంలోని ముగ్గురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఫైనాన్స్ వ్యాపారి దలీల్ చంద్(74),ఆయన భార్య కుషాల్ భాయ్(70) కుమారుడు సీతల్ (38) ఘటనాస్థలంలోనే ప్రాణాలొదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘాతుకానికి ఎవరు ఒడిగట్టారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చెన్నైలో కాల్పుల కలకలం
చెన్నైలో బుధవారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో దుండగులు ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాల్చి చంపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య
అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్. ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించారు. డాగ్ స్వ్కాడ్ కూడా నిందితులను పసిగట్టే పనిలో ఉన్నట్లు తెలిపారు.