శాసనసభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో దుశ్చర్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. స్వాభిమాన్ పక్ష పార్టీ అభ్యర్థి దేవేంద్ర భుయార్పై దాడి చేశారు. ఈ ఘటన అమరావతి జిల్లా మల్ఖెంద్లో జరిగింది.
భుయార్ తన అనుచరులతో వరుద్ నగరం వైపు వెళుతున్న క్రమంలో ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించారు. మల్ఖెంద్ రోడ్లో కారును అడ్డుకున్నారు. భుయార్‌ను, ఇతరుల్ని బయటకు లాగి దాడి చేశారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను కారుపై పోసి నిప్పుపెట్టారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
గాయపడిన భుయార్‌ను స్థానికులు, అనుచరులు.. సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.