తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​-ముగ్గురు ముష్కరులు హతం - jammu kashmir

జమ్ముకశ్మీర్​ గందెర్బాల్​ జిల్లాలో తీవ్రవాదులు, రక్షణ దళాలకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​-ముగ్గురు ముష్కరులు హతం

By

Published : Sep 28, 2019, 2:51 PM IST

Updated : Oct 2, 2019, 8:43 AM IST

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ గందెర్బాల్​ జిల్లాలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను అంతమొందించాయి బలగాలు.

ఉగ్రవాదులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లాలోని త్రుమ్​ఖాల్​ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ నేపథ్యంలో సైనికులపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు.

ముష్కరుల నుంచి ఆయుధ సామగ్రి, తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు.

రాంబన్​లోనూ ముమ్మర తనిఖీలు...

జమ్ముకశ్మీర్​లోని రాంబన్​ జిల్లాలో ఓ ఉగ్రవాది సీఆర్​పీఎఫ్​ బలగాలపై గ్రెనేడ్​ దాడి చేసి పరారయ్యాడు. అతని కోసం రక్షణ దళాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో భాగంగా ముష్కరులు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఉగ్ర కలకలం.. సైన్యం ముమ్మర గాలింపు

Last Updated : Oct 2, 2019, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details