తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ముగ్గురు చొరబాటుదారులు హతం - తాజా వార్తలు కశ్మీర్

Three  infiltrators killed
కశ్మీర్​లో ముగ్గురు చొరబాటుదారులు హతం

By

Published : Jun 9, 2020, 11:44 AM IST

Updated : Jun 9, 2020, 12:48 PM IST

12:29 June 09

జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ముగ్గురు చొరబాటుదారులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కశ్మీర్‌లోని మేఢర్​ సెక్టార్​లో భారత భూభాగంలోకి చొరబడేందుకు ఈ ముగ్గురు ముష్కరులు ప్రయత్నించగా భద్రతా దళాలు వారిని హతమార్చాయి. ఈ ఘటనలో మరో నలుగురు ఉగ్రవాదులు...సైనిక బలగాల నుంచి తప్పించుకున్నారు.

అంతకుముందు.. బారాముల్లా-హంద్వారా రహదారి పక్కన పండ్ల తోటలో పేలుడు పదార్ధాలను గుర్తించారు. ఎవరికీ ప్రమాదం లేకుండా బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది వీటిని పేల్చి వేశారు. ఈ పేలుడు పదార్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై భద్రతా దళాలు ఆరా తీస్తున్నాయి. 

11:40 June 09

కశ్మీర్​లో ముగ్గురు చొరుబాటుదారులు హతం

కశ్మీర్​ పూంఛ్​ జిల్లా మెందార్​ సెక్టార్​ వద్ద భారత్​లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు చొరబాటుదారులను బలగాలు మట్టుబెట్టాయి. మరో నలుగురు తప్పించుకున్నారు.

Last Updated : Jun 9, 2020, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details