తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్​టీ-పీసీఆర్' టెస్టు.. ఐదు రోజుల్లో 3 భిన్న ఫలితాలు - గుజరాత్​ వార్తలు

కొవిడ్​ టెస్టు​ల్లో భాగంగా ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష కీలకమైనదని చాలామంది భావిస్తున్నారు. అయితే అందులోనూ కచ్చితత్వం లేదని తెలుస్తోంది. ఒకే వ్యక్తికి ఐదురోజుల్లో మూడు భిన్నమైన ఫలితాలు రావడమే ఇందుకు కారణం. అయితే.. ఈ పరీక్షలపై మరిన్ని వివరాలను 'ఈటీవీ భారత్​'కు చెప్పారు ప్రముఖ వైద్యురాలు మోనా దేశాయ్​.

Three different reports of coronavirus came in 5 days of the same person
కరోనా ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ల్లో ఒకే వ్యక్తికి భిన్న ఫలితాలు

By

Published : Sep 23, 2020, 3:17 PM IST

కరోనా టెస్టుల్లో ప్రధాన పరీక్షగా భావించే 'ఆర్​టీ-పీసీఆర్'లోనూ కచ్చితత్వం లేదని తెలుస్తోంది. ఈ పరీక్షల ద్వారా ఇద్దరు వ్యక్తులను పరీక్షించగా భిన్న ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా వారి నమూనాలను టెస్టు చేయగా రెండుసార్లు నెగెటివ్​గానూ.. ఓ సారి పాజిటివ్​గానూ నిర్ధరణ అయింది. అలా నాలుగైదు రోజుల వ్యవధిలోనే వారివురికీ భిన్న ఫలితాలొచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఆ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది.

గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన పీయూష్​భాయ్​ వాఘేలా.. ఈ నెల 5న ఆర్​టీ-పీసీఆర్​ ద్వారా కరోనా టెస్ట్​ చేయించుకోగా వైరస్​ లేనట్టు నిర్ధరణ అయింది. అనంతరం అతడు వేరే జబ్బుతో ఆసుపత్రికి వెళ్లగా.. ప్రోటోకాల్​ ప్రకారం మళ్లీ కొవిడ్​ టెస్ట్​లు నిర్వహించారు. ఆ ఫలితాల్లో పాజిటివ్​గా తేలింది. దీంతో అనుమానం వచ్చి వేరొక ప్రైవేట్​ ల్యాబ్​లో టెస్ట్ చేయించుకోగా.. అక్కడ కరోనా​ నెగెటివ్​ వచ్చింది. ఇలా 5 రోజులుగా కొవిడ్​ పరీక్షల్లో భిన్న ఫలితాలను ఎదుర్కొన్నాడు పీయూష్​.

పీయూష్​భాయ్​ పరీక్షా విధానం- ఫలితాలు

  • సెప్టెంబర్​ 5: ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ - నెగెటివ్​
  • సెప్టెంబర్​ 8: ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ - పాజిటివ్​
  • సెప్టెంబర్​ 9: ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ - నెగెటివ్​

అచ్చం పీయూష్​ తరహా ఘటనే.. అహ్మదాబాద్​లోనే కృనాల్​ పంచాల్​కు ఎదురైంది. ఈ నెల​ 10న కృనాల్​కు యాంటిజెన్​ పరీక్షలు నిర్వహించింది అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​. ఫలితాల్లో కరోనా సోకలేదని తేలింది. అనంతరం కిడ్నీ సంబంధిత చికిత్స కోసం మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లాడు కృనాల్. అక్కడ ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​లు చేయగా.. కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అనుమానంతో సెప్టెంబర్​ 14న ఓ ప్రైవేట్​ ప్రయోగశాలను ఆశ్రయించాడు. ఇక్కడ నిర్వహించిన ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. ఆ తర్వాత కిడ్నీ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన కృనాల్​.. ఇప్పుడు డిశ్చార్జి అయి, ఆరోగ్యంగా ఉన్నాడు.

కృనాల్​ పంచాల్​ కరోనా పరీక్షల నిర్వహణ తీరు- ఫలితాలు

  • సెప్టెంబర్​ 10: ర్యాపిడ్​ యాంటిజెన్​ టెస్ట్​ - నెగెటివ్​
  • సెప్టెంబర్​ 11: ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ - పాజిటివ్​
  • సెప్టెంబర్​ 12: ర్యాపిడ్​ యాంటిజెన్​ టెస్ట్​ - నెగెటివ్​
  • సెప్టెంబర్​ 14: ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ - నెగెటివ్​

ఫలితాలపై నిపుణుల అభిప్రాయం

భిన్న ఫలితాలపై 'ఈటీవీ భారత్​'కు సమగ్ర వివరణ ఇచ్చారు అహ్మదాబాద్​ మెడికల్​ అసోసియేషన్​ అధ్యక్షులు మోనా దేశాయ్. ర్యాపిడ్​ యాంటిజెన్​ పరీక్షల్లో 40 నుంచి 50శాతం మాత్రమే కచ్చితత్వం ఉంటుందని ఆమె తెలిపారు. అయితే.. ఆర్​టీ-పీసీఆర్​లో మాత్రం 60 నుంచి 70 శాతం వరకు కచ్చితమైన ఫలితాలొస్తాయన్నారు.

శరీరంలో వైరస్​ ప్రభావం తక్కువగా ఉన్న సమయంలో నెగెటివ్​ ఫలితాలు వచ్చినా.. జ్వరం వంటి లక్షణాలు అలాగే ఉంటాయని మోనా పేర్కొన్నారు. అలాంటప్పుడు 90శాతం కచ్చితమైన ఫలితాలనిచ్చే సీటీ-స్కాన్​ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:బీపీ పరీక్ష సమయంలో పొరపాట్లు చేయొద్దు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details