తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు 5 వేలకు చేరువలో ఉన్నాయి. మహారాష్ట్రపై కొవిడ్-19​ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కేసులు, మరణాలు అక్కడే అధికంగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో 891 కరోనా కేసులు నమోదైనట్లు.. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పుణెలో ఇవాళ మరో ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు స్పష్టం చేసింది.

Three COVID-19 patients die in Pune
కరోనాతో పుణెలో మరో ముగ్గురు మృతి

By

Published : Apr 7, 2020, 5:59 PM IST

భారత్​లో కరోనా తీవ్రంగా మహారాష్ట్రలో మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 891 మందికి వైరస్​ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ 23 మందికి కరోనా సోకగా.. ముంబయి నుంచే 10 మంది ఉన్నట్లు పేర్కొంది. పుణెలో ఇవాళ మరో ముగ్గురు కరోనా సోకి మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 55కు చేరినట్లు సమాచారం.

ఒడిశాలో తొలి మరణం...

ఒడిశాలో సోమవారం మరణించిన 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. రాష్ట్రంలో ఇదే తొలి కరోనా మరణం. ఇప్పటివరకు రాష్ట్రంలో 42 మందికి కొవిడ్​-19 సోకింది.

ఒడిశా నిఘా విభాగం(ఐబీ) కార్యాలయ సిబ్బందిలో ఒకరు.. కరోనా బాధితునికి సన్నిహితంగా మెలిగిన కారణంగా ఆఫీసును మూసివేసింది భువనేశ్వర్​ మున్సిపల్​ కార్పొరేషన్​. ఉద్యోగులందరినీ 14 రోజుల క్వారంటైన్​లో ఉంచింది.

19 కేసులు.. 2 మరణాలు

గుజరాత్​లో ఇవాళ మరో 19 కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 165కు చేరింది. నేడు మరో ఇద్దరు మరణించగా.. మృతుల సంఖ్య 14కు చేరినట్లు అధికారులు ప్రకటించారు.

మిగతా రాష్ట్రాల్లో...

  • ఆంధ్రప్రదేశ్​లో మరొకరు మరణించగా.. మృతుల సంఖ్య 4కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు 304.
  • కర్ణాటకలో 12 కొత్త కేసులుతో మొత్తం ఆ సంఖ్య 175కు చేరింది. 25 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో 4 మరణాలు నమోదయ్యాయి.
  • మధ్యప్రదేశ్​లో మరో 12 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక్కడ బాధితుల సంఖ్య 268కి చేరింది.
  • గోవాలో ఇప్పటివరకు ఏడుగురు కరోనా బారిన పడ్డారు. మరో 15 మంది కరోనా అనుమానితులకు నెగటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details